: రాయల్స్ పరే'షాన్'
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ మెరుపు ఇన్నింగ్స్ తో అలరించాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మార్ష్ (77) హాఫ్ సెంచరీ సాధించడంతో కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. మార్ష్ కు తోడు గిల్ క్రిస్ట్ (42) కూడా రాణించాడు. వీరిద్దరు మినహా పంజాబ్ బ్యాట్స్ మెన్ లో మరెవ్వరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. మార్ష్ బ్యాటింగ్ సాగుతున్నంత సేపూ రాజస్థాన్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. మార్ష్.. ను కూపర్ అవుట్ చేయడంతో రాజస్థాన్ ఊపిరి పీల్చుకుంది. కెవాన్ కూపర్ 3 వికెట్లు తీసి పంజాబ్ ను కట్టడి చేశాడు. నయా సంచలనం మిల్లర్ 8 పరుగులు చేసి కూపర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.