Shah Rukh Khan: కోల్ కతా నైట్ రైడర్స్ దారుణ ఓటమితో... షారూక్ ఖాన్ క్షమాపణలు

  • ఆటలో స్ఫూర్తి లోపించింది
  • కేకేఆర్ బాస్ గా క్షమాపణలు చెప్పాలి
  • ట్విట్టర్లో షారూక్ పోస్ట్

ముంబై ఇండియన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు దారుణంగా ఓడిపోవడంతో అభిమానులకు, క్రికెట్ ప్రియులకు నటుడు షారూక్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు షారూక్ సహ యజమానిగానూ ఉన్నారు. నిన్న ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018’లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో నైట్ రైడర్స్ 102 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో షారూక్ ఖాన్ ఓ పోస్ట్ పెట్టారు. ‘‘క్రీడలన్నవి స్ఫూర్తితో కూడి ఉంటాయి. కానీ, ఆ స్ఫూర్తి లోపించడంపై అభిమానులకు కేకేఆర్ బాస్ గా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని షారూక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కేకేఆర్ తాజా ఓటమితో ఐదో స్థానానికి దిగిపోగా, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానానికి చేరుకుంది.

Shah Rukh Khan
ipl
kkr
  • Loading...

More Telugu News