Jesus: ఇళయరాజాపై చర్యలు తీసుకోండి: పోలీస్ కమిషనర్ కు చెన్నై కలెక్టర్ ఆదేశం

  • క్రీస్తు పునరుత్థానంపై ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు
  • యూట్యూబ్ వీడియోల ప్రదర్శన
  • క్రైస్తవ సంఘాల నిరసనలతో చర్యలకు ఆదేశం

ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రస్తావిస్తూ, మరణించిన వారు తిరిగి లేవడం ఒక్క రమణ మహర్షికి మాత్రమే సాధ్యమైందని చెబుతూ, వీడియోలను ప్రదర్శించిన సంగీత దర్శకుడు ఇళయరాజాపై చర్యలు తీసుకోవాలని చెన్నై కలెక్టర్ నుంచి పోలీసు కమిషనర్ కు ఆదేశాలు వెళ్లాయి.

ఇటీవల ఓ సంగీత విభావరిలో మాట్లాడిన ఇళయరాజా, క్రీస్తు చనిపోయిన తరువాత తిరిగి లేచాడని క్రైస్తవులు నమ్ముతున్నారని, అది వాస్తవం కాదని కొందరు పరిశోధకులు తేల్చారని, ఆ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయని చెబుతూ ఓ వీడియోను ప్రదర్శించారు ఇళయరాజా. ఇక ఈ వ్యాఖ్యలపై క్రైస్తవ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఆయనపై పోలీసులు కేసులను నమోదు చేశారు. కలెక్టర్ కార్యాలయం, కమిషనర్ కార్యాలయం ముందు క్రైస్తవులు ధర్నాకు దిగారు. దీంతో మొత్తం ఘటనపై విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం ఆదేశాలు వెలువరించింది.

Jesus
Ilayaraja
Tamilnadu
Christians
  • Loading...

More Telugu News