Chandrababu: పోర్న్ వీడియోల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి: చంద్రబాబు

  • దాచేపల్లిలాంటి ఘటనలు ఇకపై జరగడానికి వీల్లేదు
  • నేరాలు కొత్తకొత్త పద్ధతుల్లో జరుగుతున్నాయి
  • టెక్నాలజీని తప్పుడు మార్గంలో వినియోగిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపండి

దాచేపల్లి లాంటి దారుణ ఘటనలు ఇకపై జరగడానికి వీల్లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని జిల్లాల ఎస్పీలతో శాంతిభద్రతల అంశాన్ని సమీక్షించిన చంద్రబాబు... ఈ మేరకు పేర్కొన్నారు. రెండేళ్ల వయసున్న చిన్నారులపై బంధువులు, తెలిసినవారే అత్యాచారాలకు పాల్పడుతుండటం దారుణమని అన్నారు. పోర్న్ వీడియోల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

టెక్నాలజీని తప్పుడు మార్గంలో వినియోగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బాలికలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడుతున్నవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు. ప్రస్తుత కాలంలో నేరాలు కొత్తకొత్త విధానాల్లో జరుగుతున్నాయని... నేరాల తీరును గమనిస్తూ, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పారు బెట్టింగ్ మాఫియాను టెక్నాలజీ సాయంతో అరికట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని... ఈవ్ టీజింగ్, గంజాయి, డ్రగ్స్ లాంటివి లేకుండా చూడాలని ఆదేశించారు. 

Chandrababu
porn
sp
dachepalli
rapes
  • Error fetching data: Network response was not ok

More Telugu News