Supreme Court: ఫేర్‌వెల్ పార్టీకి రానని చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
- ఈ ఏడాది జూన్ 22న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రిటైర్మెంట్
- సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఫేర్‌వెల్ ఇవ్వడం ఆనవాయతి
- అటార్నీ జనరల్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఒప్పుకోని వైనం
సుప్రీంకోర్టులో రోస్టర్ తయారీ విధానం, కేసుల కేటాయింపు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేశ చరిత్రలోనే మొదటి సారిగా కొన్ని నెలల ముందు మీడియా ముందుకు వచ్చిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఈ ఏడాది జూన్ 22న రిటైర్ కానున్నారు.
న్యాయమూర్తుల పదవీ విరమణ సమయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఫేర్‌వెల్ పార్టీ ఇవ్వడం ఆనవాయతిగా వస్తోంది. ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ నుంచి ఆహ్వానం అందగా జస్టిస్ చలమేశ్వర్ దాన్ని తిరస్కరించారు. అటార్నీ జనరల్ విజ్ఞప్తి చేసినప్పటికీ తనకు ఆసక్తిలేదని తెలిపారు.