India: భారత్‌పై దాడి చేయించడానికి ఐఎస్‌ఐ భారీ కుట్ర: భారత నిఘా వర్గాల వెల్లడి
- కశ్మీర్ లోయలో దాడులు జరిగే అవకాశం
- తాలిబన్ ఉగ్రవాదులకు శిక్షణ
- అమర్‌నాథ్ యాత్రపై కూడా దాడి చేసే ప్రమాదం
కశ్మీర్ లోయలో దాడులు చేయించేందుకు పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) సిద్ధమవుతోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తమ జైళ్లలో ఉన్న తెహ్రిక్ ఐ తాలిబన్ ఉగ్రవాదులను ఐఎస్‌ఐ విడుదల చేయించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోందని పేర్కొన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నయాలీ అటవీ ప్రాంతంలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశాయి.
ఆ ప్రాంతంలో సుమారు 135 మంది ఉగ్రవాదులకు జైషే ఈ మహమ్మద్ ఉగ్రసంస్థ నయాలీలోని శిక్షణ కేంద్రంలో ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇస్తోందని, ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. దీనిపై హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమై సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది.