mahanati: 'మహానటి' సినిమాపై రాజమౌళి స్పందన

  • నాగ్ అశ్విన్, స్వప్నలు చాలా గొప్పగా తీశారు
  • సావిత్రికి కీర్తి సురేష్ జీవం పోశారు
  • దుల్కర్ సల్మాన్ కి నేను అభిమానిగా మారాను

దేశం గర్విచదగ్గ నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' సినిమా నేడు భారీ ఎత్తున విడుదలై... ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. మహానటి చరిత్రను అద్భుతంగా తెరకెక్కించారంటూ సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు.

గొప్ప చిత్రాన్ని తీశారంటూ నాగ్ అశ్విన్, స్వప్నలను అభినందించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు సూపర్బ్ అంటూ కితాబిచ్చారు. తన జీవితంలో తాను చూసిన అత్యద్భుత పర్ఫామెన్స్ లలో ఈ చిత్రంలో కీర్తి సురేష్ ది ఒకటని చెప్పారు. మహానటికి ఆమె మళ్లీ జీవం పోశారని కితాబిచ్చారు. దుల్కర్ సల్మాన్ నటన అద్భుతంగా ఉందని... అతనికి తాను ఇప్పుడు ఫ్యాన్ గా మారిపోయానని ట్వీట్ చేశారు. 

mahanati
ss rajamouli
keerthi suresh
dulkar salman
nag aswin
swapna
  • Loading...

More Telugu News