Pawan Kalyan: అవనిగడ్డ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో పవన్ కల్యాణ్: జనసేన ఇన్ ఛార్జ్

  • విషయాన్ని వెల్లడించిన ముత్తంశెట్టి కృష్ణారావు
  • అవనిగడ్డలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం
  • అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పిన పవన్

రానున్న ఎన్నికల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని జనసేన ఇన్ ఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. అవనిగడ్డలో ఉన్న ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పైవిషయాన్ని తెలిపారు.

అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మరోవైపు, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, పవన్ పోటీ చేసే స్థానంపై జనసేన నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

Pawan Kalyan
avanigadda
Jana Sena
muttamsetty krishnarao
  • Loading...

More Telugu News