rajasekhar: రాజశేఖర్ హీరోగా 'కల్కి'.. త్వరలో సెట్స్ పైకి

  • ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ 
  • కొనసాగుతోన్న నటీనటుల ఎంపిక 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు

చాలాకాలం తరువాత 'గరుడ వేగ' సినిమాతో రాజశేఖర్ అనూహ్యమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వచ్చే సినిమా ఆ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మంచి కథల కోసం రాజశేఖర్ వెయిట్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'అ!' దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక కథను వినిపించాడు.

కథలోని వైవిధ్యం కారణంగా .. ఇంతవరకూ తాను ఈ తరహా సినిమా చేయకపోవడం వలన వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి .. సెట్స్ పైకి వెళ్లడానికి ప్రశాంత్ వర్మ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాతో పాటు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలోను రాజశేఖర్ ఒక సినిమా చేయనున్నాడు. తమిళంలో ధనుష్ దర్శకత్వంలో హిట్ కొట్టిన 'పవర్ పాండి'కి తెలుగులో ఇది రీమేక్.    

  • Loading...

More Telugu News