samantha: సమంతతో నటించడం చాలా సరదాగా ఉంది: విజయ్ దేవరకొండ

  • సమంత ఎప్పుడూ జోక్స్ వేసి నవ్విస్తుంటుంది
  • స్వప్న, నాగ్ అశ్విన్ నాకు మంచి ఫ్రెండ్స్
  • తమిళంలో నటించినా వర్కవుట్ అవుతుంది

'మహానటి' సినిమాలో సమంతలాంటి స్టార్ తో నటించడం చాలా సరదాగా అనిపించిందని హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. సమంత ఎప్పుడూ హుషారుగా ఉంటుందని, జోక్స్ వేస్తూ నవ్విస్తుంటుందని చెప్పారు. 'మహానటి' గురించి స్వప్న ఫోన్ చేసి చెప్పగానే... ఎలాంటి వివరాలు అడక్కుండానే ఒప్పేసుకున్నానని... స్వప్న, నాగ్ అశ్విన్ ఇద్దరూ తన ఫ్రెండ్స్ కావడమే దీనికి కారణమని తెలిపాడు.

మొదట జెమినీ గణేషన్ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ ను సంప్రదిస్తే... డేట్స్ కుదరక ఆయన ఒప్పుకోలేదని... దీంతో, తనను చేయాలని నాగ్ కోరాడని చెప్పాడు. అయితే, జెమినీ పాత్రను తాను పోషించగలనా అనే భయం ఉండేదని... కానీ, మళ్లీ దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తాను తప్పించుకున్నానని తెలిపాడు. చివరకు విజయ్ ఆంటోని పాత్రలో సెటిల్ అయ్యానని చెప్పారు. తమిళ, తెలుగు సినిమాలు చాలా వరకు దగ్గరగా ఉంటాయని... దీంతో, తమిళంలో నటించినా వర్కవుట్ అవుతుందని తెలిపాడు.

samantha
swapna
nag aswin
mahanati
gemini ganeshan
tollywood
  • Loading...

More Telugu News