Sonia Gandhi: మీ ప్రసంగాల వల్ల ఒరిగేదేమీ లేదు: మోదీపై సోనియాగాంధీ విమర్శలు

  • మోదీ ప్రసంగాలతో పేదల కడుపు నిండదు
  • కడుపు నిండాలంటే అన్నం, పప్పు ఉండాలి
  • సిద్ధరామయ్య ప్రభుత్వం పేదలకు సబ్సిడీలపై ఆహారాన్ని అందించింది

చాలా కాలం తర్వాత యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా, బెంగళూరులో ఆమె ప్రచారం నిర్వహించారు. భారీ సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రధాని మోదీపై ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఈనెల 12న జరిగే ఎన్నికల్లో బీజేపీ విఫలమవుతుందని ఆమె అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజానీకం ఘన విజయాన్ని అందించబోతున్నారని చెప్పారు. ప్రసంగించడంలో ప్రధాని మోదీ మంచి నేర్పరి అని... అయితే ఆయన ప్రసంగాలు పేదల కడుపు నింపవని, అనారోగ్యం నుంచి కాపాడలేవని ఎద్దేవా చేశారు. కడుపు నిండాలంటే అన్నం, పప్పు కావాలని, అరోగ్యం కావాలంటే హెల్త్ సెంటర్లు కావాలని చెప్పారు. పేదలకు కూడా మంచి ఆహారం ఉండాలనే గొప్ప లక్ష్యంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సబ్సిడీపై ఆహారాన్ని అందించిందని సోనియా అన్నారు. 

Sonia Gandhi
siddaramaiah
congress
karnataka
elections
campaign
  • Loading...

More Telugu News