West Bengal: అందరితో మాట్లాడినట్టే కేసీఆర్ తోనూ మమతాబెనర్జీ మాట్లాడారంతే!: పశ్చిమ బెంగాల్ ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు

  • ఏడుసార్లు ఎంపీగా గెలిచిన మమతా బెనర్జీ
  • ఎన్నో పదవులను అలంకరించారన్న అమిత్ మిత్రా
  • ఆమెకు ఎందరితోనో పరిచయాలున్నాయి
  • చంద్రబాబుతోనూ మాట్లాడుతున్నారన్న మిత్రా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి దేశవ్యాప్తంగా పలువురు నేతలతో పరిచయాలు ఉన్నాయని, వారందరితో మాట్లాడినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ మాట్లాడారని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి అమిత్ మిత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం అమరావతిలో జరుగగా, అమిత్ మిత్రా వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులను అలంకరించిన ఆమెకు ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలున్నాయని గుర్తు చేశారు. కేసీఆర్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబుతోనూ ఆమె మాట్లాడుతున్నారని అన్నారు. 15వ ఆర్థిక సంఘం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తామంతా కలసి పోరాడుతామని అన్నారు.

West Bengal
Mamata Benarjee
KCR
Chandrababu
Amit Mitra
  • Loading...

More Telugu News