KCR: దురిశెట్టి అనుదీప్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం!: ముఖ్యమంత్రి కేసీఆర్

  • జాతీయస్థాయిలో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్
  • కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన అనుదీప్ కుటుంబం
  • తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్న కేసీఆర్

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా టాప్ ర్యాంకర్ గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదు ప్రగతి భవన్ లో అనుదీప్, ఆయన తల్లిదండ్రులు సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ జాతీయస్థాయిలో టాపర్‌గా నిలువడం రాష్ట్రానికే గర్వకారణమని, అనుదీప్ ని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శమని సీఎం అన్నారు.

KCR
Telangana
KTR
TRS
Hyderabad
Hyderabad District
  • Loading...

More Telugu News