lalu prasad yadab: ఢిల్లీ కోర్టుకు హాజరైన లాలూ ప్రసాద్ కుమార్తె, అల్లుడు!

  • మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరైన మిసా భారతి, ఆమె భర్త
  • రూ. 8 వేల కోట్లకు సంబంధించిన కేసు
  • ఓ సీక్రెట్ కంపెనీ ద్వారా మనీ లాండరింగ్

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్ లను ఈరోజు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. రూ. 8 వేల కోట్ల మనీ లాండరింగ్ కు సంబంధించి వీరిద్దరిపై ఈడీ కేసు నమోదు చేసింది. సురేంద్ర జైన్, వీరేంద్ర జైన్ అనే ఇద్దరు వ్యాపారులకు చెందిన ఓ సీక్రెట్ కంపెనీ ద్వారా... మిసా భారతి, ఆమె భర్త నల్లధనాన్ని చలామణిలోకి తీసుకొస్తున్నట్టు అభియోగాలు మోపింది. ఆ ఇద్దరు వ్యాపారులను కూడా కోర్టులో ప్రవేశపెట్టగా గత జనవరిలో వారిద్దరికీ రూ. 2 లక్షల పూచీకత్తు మీద బెయిల్ లభించింది. మిసా భారతి దంపతులకు కూడా బెయిల్ ఇచ్చినప్పటికీ.... దేశాన్ని మాత్రం విడిచి వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. 

lalu prasad yadab
misa bharathi
sailesh kumar
money laundering
patiyala court
Enforcement directorate
  • Loading...

More Telugu News