chaman: గత మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్

  • వెంకటాపురంలో రవి, సునీతల కుమార్తె వివాహం
  • పెళ్లి పనులను దగ్గరుండి పర్యవేక్షించిన చమన్
  • ఎనిమిదేళ్లు అజ్ఞాతంలో ఉన్న చమన్

దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 58 ఏళ్లు. పరిటాల రవి, సునీతల కుమార్తె స్నేహలత వివాహం నేపథ్యంలో, గత మూడు రోజులుగా ఆయన వెంకటాపురంలోనే ఉన్నారు. పెళ్లి పనులను పర్యవేక్షించారు. ఈ ఉదయం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఎనిమిదేళ్ల పాటు చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2012లో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, పరిటాల సునీత మంత్రి కావడం జరిగాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి ఆయన జడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత ఒక ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు అనంతపురం జడ్పీటీసీగా పని చేశారు.

chaman
paritala ravi
paritala sunitha
  • Loading...

More Telugu News