Karnataka: సెకనుకు 27 విమర్శలు... కన్నడనాట కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియా వార్!

  • ముదిరి పాకాన పడ్డ విమర్శల వేడి
  • సోషల్ మీడియా వార్ రూమ్ లు బిజీ
  • ఒక్కో పార్టీ నుంచి గంటకు లక్ష మెసేజ్ లు

కర్ణాటకలో ఎన్నికల వేడి మరింతగా ముదిరి పాకానపడింది. గెలుపే లక్ష్యంగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు పావులు కదుపుతుండగా, సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రెండు పార్టీలూ ప్రత్యేక ఐటీ వార్ రూములను ఏర్పాటు చేసి ప్రత్యర్థులపై ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నాయి. బెంగళూరులో బీజేపీ రెండు వార్ రూములను నిర్వహిస్తుండగా, ఐఐఎం విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులతో ఒక్కో రూమ్ లో 30 మంది చొప్పున పని చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ వార్ రూమ్ లో సైతం 25 మందికి పైగానే పని చేస్తున్నారు. వీరి పనల్లా ఒక్కటే, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలను తయారు చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. ఇక గంటకు లక్షకుపైగా మెసేజ్ లు ప్రజల్లోకి వెళుతున్నాయని తెలుస్తోంది. అంటే సెకనుకు 27కు పైగా మెసేజ్ లు పోస్ట్ అవుతున్నాయి. అంటే గంటకు లక్ష మెసేజ్ లను వీరు వైరల్ చేస్తున్నారన్నమాట. ఈ మెసేజ్ లు లక్షలాది మంది ఓటర్లకు చేరేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకుని ఉన్నాయి ఈ పార్టీలు.

  • Loading...

More Telugu News