Karnataka: బహిరంగ చర్చకు సిద్ధమా?: మోదీకి సవాల్ విసురుతూ దినపత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ లు ఇచ్చిన సిద్ధరామయ్య!

  • ఓటర్లను అయోమయంలో పడేస్తున్న మోదీ
  • నాతో చర్చకు సిద్ధమా?
  • సవాల్ విసిరిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక ఓటర్లను ప్రధాని నరేంద్ర మోదీ అయోమయంలో పడేస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసురుతూ సీఎం సిద్ధరామయ్య సంతకంతో కూడిన ఫుల్ పేజీ ప్రకటనలు నేడు కర్ణాటక దినపత్రికల్లో ప్రచురితం అయ్యాయి. రాష్ట్రంలో తన పోటీ నరేంద్ర మోదీతో కాదని, యడ్యూరప్పతోనేనని వెల్లడించిన ఆయన, ఓపెన్ డిబేట్ కు తాను సిద్ధమని, తనతో చర్చకు యడ్యూరప్పతో పాటు నరేంద్ర మోదీలను ఆహ్వానిస్తున్నానని అన్నారు.

ప్రజలముందు మోదీ తప్పుడు సమాచారాన్ని ఉంచుతున్నారని, అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు సత్యవంతులో కర్ణాటక నిర్ణయిస్తుందని అన్నారు. 6.5 కోట్ల మంది కర్ణాటక ప్రజల భవిష్యత్తు కోసం తాను పాటుపడుతున్నానని, దీనిపై చర్చకు తేదీ, సమయం, ప్రాంతం చెబితే ఎక్కడికైనా వస్తానని అన్నారు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని చెబుతూ సంతకం చేశారు. సిద్ధరామయ్య సవాల్ పై బీజేపీ స్పందించాల్సి వుంది.

Karnataka
Congress
Siddharamaiah
Narendra Modi
yedeyurappa
  • Error fetching data: Network response was not ok

More Telugu News