Esha Ambani: కాబోయే భర్తతో కృష్ణుడి గుడిలో మెరిసిన ఇషా అంబానీ!

  • ఆనంద్ పిరామల్ తో ఇటీవలే ఇషా నిశ్చితార్థం
  • నిన్న ఐపీఎల్ మ్యాచ్ కి ముందు ఇస్కాన్ టెంపుల్ కు
  • ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇటీవల పిరామల్ ఫ్యామిలీ వారసుడు ఆనంద్ పిరామల్ తో నిశ్చితార్థం చేసుకున్న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, గత రాత్రి ముంబైలోని ఇస్కాన్ ఆలయానికి వెళ్లి భగవంతుడిని దర్శించుకున్నారు. నిన్న ఐపీఎల్ మ్యాచ్ కి ముందు రెండు కుటుంబాలకు చెందిన వాళ్లు ఆలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది.

పింక్ కలర్ గాగ్రాలో ఇషా మెరిసిపోతుండగా, నీతా అంబానీ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి ఆలయానికి వచ్చారు. వీరికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఇషా, ఆనంద్ ల వివాహం డిసెంబర్ లో జరగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇషా కవల సోదరుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకతో జరుగగా, వీరిద్దరి పెళ్లి కన్నా ముందే ఇషా పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది.

Esha Ambani
IPL
Iscon Temple
Mukesh Ambani
Anand Piramal
  • Loading...

More Telugu News