Andhra Pradesh: ఆర్థిక సంఘం విధుల్లో కేంద్రం జోక్యం సరికాదు!: ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు
- ఆర్థిక సంఘం ఏర్పాటు వరకే కేంద్ర ప్రభుత్వం బాధ్యత
- రాష్ట్రాలపై ఆర్థికభారం మోపేలా వ్యవహరిస్తున్న కేంద్రం
- సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్రం
ఆర్థిక సంఘం విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం సరికాదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీలో రేపు పదకొండు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరగనుంది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, ఆర్థిక సంఘం ఏర్పాటు వరకే కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని సూచించారు. సంక్షేమ నిధులను ఇవ్వకుండా తప్పించుకున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలపై ఆర్థికభారం మోపేలా వ్యవహరిస్తోందని, జీఎస్టీలో ఎలాంటి పన్నులు ఉండవని చెప్పారని, ఇప్పుడేమో, చక్కెరపై పన్ను వేస్తున్నారని, ఈ పద్ధతి కరెక్టు కాదని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని యనమల మండిపడ్డారు.