Nayeem: నయీమ్ భార్యను అరెస్ట్ చేసిన సిట్!

  • రెండేళ్ల క్రితం ఎన్ కౌంటర్ లో నయీమ్ మృతి
  • భువనగిరిలో ఆయన భార్య అరెస్ట్
  • కేసు విచారణలో భాగంగానేనన్న సిట్

దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఎన్ కౌంటర్ లో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసును విచారిస్తున్న సిట్ పోలీసులు తాజాగా, ఆయన భార్య హసీనాను అరెస్ట్ చేశారు. భువనగిరిలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత అతని కుటుంబీకుల్లో పలువురిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

నయీమ్ కోడలు, అల్లుడు, మరో అనుచరుడిని గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు, తవ్వుతున్నకొద్దీ ఈ కేసులో ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు. వాటిపై మరిన్ని ఆధారాలు, వివరాలు సేకరించాలన్న ఉద్దేశంతోనే హసీనాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

Nayeem
Encounter
SIT
Police
Bhuvanagiri
  • Loading...

More Telugu News