Andhra Pradesh: ఆడవారి జోలికెళ్తే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే: చంద్రబాబు
- దాచేపల్లి ఘటన సమాజానికే మాయని మచ్చ
- బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటా
- సోమవారం నాడు జరిగే ర్యాలీలో అందరూ పాల్గొనాలి
దాచేపల్లిలో అత్యాచార ఘటన సమాజానికే మాయని మచ్చ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటనలు ఇకపై రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. జీవితం చాలా విలువైందని... నైతిక విలువలను పెంచుకోవడం, నిశ్శబ్దాన్ని ఛేదించడం ద్వారా ఎయిడ్స్‌ను నియంత్రించామని పేర్కొన్నారు. లైంగిక వేధింపులపై కూడా నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన సమయం ఆసన్నమయిందని, అరాచకాలను ప్రతిఘటించాలని, ఆడవారి జోలికెళ్తే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనన్న భయం కలగాలని అన్నారు. సోమవారం నాడు జరిగే 'ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం' ర్యాలీలో అందరూ పాల్గొని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. చట్టాలను కఠినంగా రూపొందిస్తున్నామని, నిందితులు ఎవరైనా సహించేది లేదని పేర్కొన్నారు.