Andhra Pradesh: టీటీడీ చైర్మన్‌ గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నియామకాన్ని వ్యతిరేకిస్తూ 'ఛలో రాజ్‌భవన్': వీహెచ్‌పీ

  • పుట్టా సుధాకర్‌ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న వీహెచ్‌పీ
  • 'ఛలో రాజ్‌భవన్' కార్యక్రమానికి పిలుపు
  • హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరింపు

టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ప్రకటించిన నాటి నుంచే విశ్వ హిందూ పరిషత్ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మతమార్పిడిల కోసం ఏర్పాటు చేసే సభలకు ముఖ్య అతిథిగా ఆయన వెళతారని, ఆ సభలకు ఆర్థిక సాయం కూడా చేస్తుంటారని వీహెచ్‌పీ ఆరోపిస్తుంది. తాజాగా ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ 'ఛలో రాజ్‌భవన్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

Andhra Pradesh
TTD
Hyderabad
Telangana
vhp
Chandrababu
  • Loading...

More Telugu News