balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ కోసం మరాఠీ సీనియర్ నటుడు

  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహకాలు 
  • కొనసాగుతున్న నటీనటుల ఎంపిక
  • సంగీత దర్శకుడిగా కీరవాణి  

'ఎన్టీఆర్' సినిమాను బాలకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ .. ఆ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ .. దర్శకత్వం వహించనున్నారు. దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను చంద్ర సిద్ధార్థకి అప్పగించినట్టుగా తెలుస్తోంది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాకి, బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ముఖ్యమైన పాత్రధారుల ఎంపిక కొనసాగుతోంది.

నందమూరి తారకరామారావు రాజకీయ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల్లో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ఒకటి. ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ నటుల పేర్లను పరిశీలించిన ఈ సినిమా టీమ్, ప్రముఖ మరాఠీ నటుడు సచిన్ ఖేదేకర్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. వివిధ భాషా చిత్రాల్లో నటించిన ఆయనకి సహజ నటుడు అనే మంచి పేరుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 

  • Loading...

More Telugu News