ntr: రాయలసీమ యాసలో ఎన్టీఆర్ డైలాగ్స్

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ 
  • ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • దసరాకి భారీ స్థాయిలో విడుదల

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఈ నెలలో రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సన్నాహకాలు చేసుకుంటోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. అందువలన ఈ సినిమా మొత్తం కూడా ఎన్టీఆర్ డైలాగ్స్ రాయలసీమ మాండలికంలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఒక ఫోక్ సాంగ్ కూడా రాయలసీమ యాసలోనే సాగుతుందట. ఈ పాటను పెంచల్ దాస్ తో పాడించనున్నట్టు సమాచారం. 'కృష్ణార్జున యుద్ధం' సినిమా కోసం ఆయన పాడిన 'దారి చూడు .. దమ్ముచూడు'  పాట ఎంత పాప్యులర్ అయిందనేది తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

  • Loading...

More Telugu News