akhil: ప్రేమకథతో కొరటాల నెక్స్ట్ మూవీ .. హీరోగా అఖిల్?

  • కొరటాల నెక్స్ట్ మూవీపై ఆసక్తి 
  • సందేశం జోలికి వెళ్లనంటోన్న కొరటాల 
  • ఈ సారి ప్రేమకథాంశమే నేపథ్యం  

ఇప్పటివరకూ కొరటాల తాను తెరకెక్కించిన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక సందేశాన్ని అందించాడు. ఆయన చేసిన ఏ సినిమా ఇంతవరకూ అపజయాన్ని పొందలేదు. ప్రతి సినిమా ఒకదానికి మించి మరొకటి ఘన విజయాలను అందుకుంటూ వెళుతున్నాయి. ఇటీవల వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా అదే విషయాన్ని మరోసారి నిరూపించింది.

 ఈ సినిమా తరువాత కొరటాల ఏ హీరోతో చేయనున్నాడు? ఎలాంటి సందేశాన్ని ఇవ్వనున్నాడు? అనే ఆసక్తి అందరిలోనూ వుంది. అయితే ఈ సినిమాలో ఎలాంటి సందేశం ఉండదని సమాచారం. ఈ సినిమా వరకూ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనను ఆయన పక్కన పెట్టేస్తున్నాడట. ప్రేమకథాంశంగా ఈ సినిమా రూపొందనుందనీ .. అఖిల్ హీరోగా చేయనున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News