husband: కొత్త సంసారంలో కలతలు రేపిన ప్రియుడు.. భర్తకు భార్య అశ్లీల ఫొటోలు

  • ఏప్రిల్ 20న జరిగిన పెళ్లి
  • భార్య అశ్లీల ఫొటోలను భర్తకు వాట్సాప్ చేసిన ప్రియుడు
  • బీటలువారిన పచ్చటి సంసారం

ఓ ప్రియుడు చేసిన నిర్వాకం పచ్చటి కొత్త సంసారంలో కలతలు రేపింది. వివరాల్లోకి వెళ్తే, ఒడిశాలోని జయపురం సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి చెందిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన యువతికి ఏప్రిల్ 20న వివాహం జరిగింది. వారు ఇంకా వైవాహిక జీవితాన్ని కూడా ఆరంభించలేదు. ఇంతలోనే, ఆమె భర్తకు వాట్సాప్ ద్వారా ఓ యువకుడు వధువుకు చెందిన అశ్లీల ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలను చూసిన భర్త షాక్ కు గురయ్యాడు. అశ్లీలంగా ఉన్న తన భార్య ఫొటోలను చూసి నిశ్చేష్టుడయ్యాడు.

ఈ అశ్లీల ఫొటోలపై బాధిత భర్త సదర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జరిపిన దర్యాప్తులో... ఫొటోలు పంపించింది వధువు బోయ్ ఫ్రెండ్ అని తేలింది. నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తన భార్యతో కాపురం చేయలేనని భర్త స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 

husband
wife
boy friend
whatapp
photos
  • Error fetching data: Network response was not ok

More Telugu News