Tollywood: సెల్ఫీలు దిగే వాళ్లందరూ ఓటేయరు!: నటుడు సాయికుమార్

  • ప్రముఖులతో సెల్ఫీలు దిగేందుకే ప్రజలు ఆసక్తి కనబరుస్తారు
  • సినీ తారలతో రోడ్ షో ల వల్ల ఫలితం ఉండదు
  • బాగేపల్లి నియోజకవర్గంలో నా విజయం ఖాయం

సినీతారలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నంత మాత్రాన, వారితో కలిసి సెల్ఫీలు దిగేవాళ్లందరూ ఆయా పార్టీలకే ఓట్లు వేస్తారని చెప్పలేమని కర్ణాటకలోని బాగేపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, నటుడు సాయికుమార్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రముఖులతో సెల్ఫీలు దిగేందుకే ప్రజలకు ఆసక్తి కనబరుస్తారని అన్నారు.

ప్రజల్లోకి నేరుగా చొచ్చుకుపోయే అతిపెద్ద మీడియా ‘సినిమా’నే అని చెప్పిన సాయికుమార్, సినీ తారలతో రోడ్ షో లు నిర్వహించడం వల్ల ఫలితం ఉండదని అన్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించడంతో పాటు సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంకుతో తాను విజయం సాధించడం ఖాయమని సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Tollywood
saikumar
  • Loading...

More Telugu News