Akun Sabharwal: తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అకున్‌ సభర్వాల్

  • ఆ శాఖ అధికారులతో భేటీ
  • పౌరసరఫరాల శాఖలో ఐటీ ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్ష
  • పలు సూచనలు చేసిన అకున్‌ సభర్వాల్

తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి అకున్‌ సభర్వాల్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులతో పాటు, పౌర సరఫరాల సంస్థ, లీగల్‌ మెట్రాలజీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మూడు విభాగాలకు సంబంధించి కార్యకలాపాలను సమీక్షించారు. పౌరసరఫరాల శాఖలో ఐటీ ప్రాజెక్టుల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించి, రేషన్ బియ్యం తరలించే వాహనాల కదలికలను, గోదాముల్లో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ- పాస్‌ యంత్రాల పనితీరు, ఈ- వెయింగ్‌ మిషన్‌, టీ-రేషన్‌ యాప్‌, రేషన్‌ పోర్టబిలిటీ వంటి వాటి గురించి కమిషనర్‌కి ఐటీ అధికారులు వివరించారు. అనంతరం వినియోగదారుల ఫోరం, పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్, టోల్‌ ఫ్రీ నెంబరు, వాట్సప్‌ కంట్రోల్ రూమ్ పనితీరులను అడిగి తెలుసుకున్నారు.

ఏ అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయనే దానిపై సంబంధిత అధికారులను అడిగారు. ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు తనకు అందించాలని, రేషన్‌ బియ్యాన్ని తరలించే వాహనాల కదలికల వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారు.       

Akun Sabharwal
Civil Supplies Commissioner
Telangana
  • Loading...

More Telugu News