nagababu: మా అబ్బాయి సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనే తొందర లేదు: నాగబాబు

  • వరుస హిట్లతో వరుణ్ తేజ్ 
  • చేతినిండా సినిమాలు 
  • కొడుకు సినిమాకి నిర్మాతగా మారే ఛాన్స్ లేకపోలేదు

గతంలో నాగబాబు నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ క్రమంలో చరణ్ తో చేసిన 'ఆరెంజ్' సినిమా ఆయనని నష్టాల ఊబిలోకి తోసింది. దాంతో అప్పటి నుంచి ఆయన సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. బన్నీ పట్టుబట్టడంతో 'నా పేరు సూర్య' సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆర్ధికంగా కాస్త కుదురుకున్న కారణంగానే ఆయన బన్నీ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

వరుణ్ తేజ్ వరుస సక్సెస్ లతో ఉండటం వలన, ఆయన హీరోగా సినిమాలను నిర్మించవచ్చుగదా? అనే ప్రశ్న తాజాగా నాగబాబుకు ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. "వరుణ్ తేజ్ కి వెంటవెంటనే రెండు హిట్లు పడ్డాయి. ఇప్పుడు వరుణ్ చేతినిండా సినిమాలున్నాయి. యూత్ లో వరుణ్ కి గల క్రేజ్ కూడా పెరిగింది. అలా అని చెప్పేసి నా కొడుకు సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనే తొందర నాకు లేదు. సమయం వచ్చినప్పుడు నా కొడుకు సినిమాకి నేను నిర్మాతగా మారే అవకాశమూ లేకపోలేదు" అంటూ చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News