EAMCET: ఏపీలో 11 వేల మంది తలరాత... ఎంసెట్ పాస్, ఇంటర్ లో ఫెయిల్!
- సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే
- అప్పుడే ర్యాంకులు ప్రకటిస్తాం
- వెల్లడించిన విద్యా శాఖ అధికారులు
ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా 11,237 మంది ఇంటర్ విద్యార్థులు నిన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారుగానీ, అంతకుముందు వచ్చిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో వీరంతా సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో సీట్లను పొందేందుకు అర్హులవుతారు.
ఇంజనీరింగ్ లో 8,569 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల్లో 2,668 మంది ఎంసెట్ పాస్ అయ్యి, ఇంటర్ తప్పినవాళ్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరికి ర్యాంకులు దూరమయ్యాయని, సప్లిమెంటరీ రాసి ఇంటర్ పాస్ అయితేనే వీరికి ర్యాంకులు ఇస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.