Secunderabad: చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఘోరం... టాయిలెట్ నీటితో టీ... వీడియో బయటకు రావడంతో రూ. లక్ష జరిమానా!

  • సికింద్రాబాద్ స్టేషన్లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్
  • లైసెన్స్ రద్దు చేసిన అధికారులు

రైళ్లలో ప్రయాణిస్తున్న వేళ, వేడివేడిగా టీ తాగితే బాగుండునని భావిస్తూ, రైల్లో టీ అమ్మేవారి దగ్గర కొనుగోలు చేసి తాగుతుంటాం. ఇక ఈ తాజా వీడియో చూస్తే మాత్రం జీవితంలో ఎవరూ రైల్లో టీ తాగరేమో. ఓ టీ అమ్మకందారు, తన టీ క్యాన్ లోకి టాయిలెట్ లో వస్తున్న నీటిని పట్టుకుంటుండగా, వీడియో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో, అధికారులు అతనిపై రూ. లక్ష జరిమానాగా విధించారు.

ఈ వీడియోను చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో కొన్నాళ్ల క్రితం తీసినట్టు తెలుస్తోంది. టీ క్యాన్ ను టాయిలెట్ లోకి తీసుకుని వెళ్లిన వెండర్, దానిలో ఉన్న టీలో నీటిని నింపుకుని రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, విచారణ అనంతరం అతనిపై జరిమానా విధించామని అధికారులు తెలిపారు. అతని పేరు పీ శివప్రసాద్ అని, సికింద్రాబాద్ నుంచి కాజీపేట మధ్య తిరిగే రైళ్లలో టీ అమ్మేందుకు లైసెన్స్ పొందాడని, అతని లైసెన్స్ ను రద్దు చేశామని తెలిపారు.

Secunderabad
Charminar Express
Tea
Toilet Water
  • Error fetching data: Network response was not ok

More Telugu News