Tollywood: తాజా వివాదాల నేపథ్యంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగు సినీ పరిశ్రమ
- టాలీవుడ్‌ని కుదిపేస్తోన్న వివాదాలు
- కౌన్సెలింగ్/మార్గదర్శనం కోసం ఒక ప్యానెల్
- లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మరో ప్యానెల్
తెలుగు సినీ పరిశ్రమను వివాదాలు కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయాలపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ పలు నిర్ణయాలు తీసుకుని ఈ రోజు ప్రకటన విడుదల చేసింది. టాలీవుడ్లోకి ప్రవేశించాలనుకునే నటీనటులకు కౌన్సెలింగ్/మార్గదర్శనం కోసం ఒక ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
అలాగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక ప్యానెల్ ను నియమిస్తున్నట్లు, ఇందులో 50 శాతం మంది ప్రతినిధులు ఇండస్ట్రీ బయటి వ్యక్తులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ప్యానెల్లో డాక్టర్లు, లాయర్లు, విశ్రాంత ప్రభుత్వోద్యోగులు, విద్యావేత్తలు, సైకాలజిస్టులు మెంబర్లుగా ఉంటారని తెలిపింది.