naa peru surya: అల్లు అర్జున్‌ క్యాప్‌ ట్రిక్స్ వీడియోలు చూశారా?

  • ఆకట్టుకుంటోన్న వీడియోలు
  • ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బన్నీ 
  • విడుదలకు సిద్ధమైన 'నా పేరు సూర్య'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా బన్నీ తన ట్విట్టర్‌ ఖాతాలో రెండు వీడియోలు పోస్ట్ చేశాడు. అందులో ఒక దాంట్లో అల్లు అర్జున్‌ క్యాప్‌తో ట్రిక్స్ ప్రయత్నిస్తున్నాడు. 'నా పేరు సూర్య' సినిమాలోని 'లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో ' అనే పాటలో బన్నీ ఈ ట్రిక్‌ ప్రయోగించాడు. అందుకోసం తను ట్రైనింగ్‌ తీసుకుంటుండగా ఈ వీడియో తీశారు. మరో వీడియోలో బన్నీ తన కొత్త సినిమాలో చేసిన డ్యాన్సును చూపించాడు.

ఎన్నో ట్రిక్కులను బన్నీ కొన్ని గంటల్లోనే నేర్చుకున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. బన్నీ నిబద్ధతపై దర్శకుడు వక్కంతం వంశీ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 'నా పేరు సూర్య' సినిమా ఎల్లుండి విడుదల కానుంది.

naa peru surya
Allu Arjun
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News