ntr: ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ మూవీ

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్  
  • ముఖ్య పాత్రల్లో జగపతిబాబు .. నాగబాబు
  • దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచన

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కలయికతో కూడినవిగా ఉంటాయి. ఈ సినిమాలో యాక్షన్ అనేది ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడినదిగా ఉంటుందనేది తాజా సమాచారం.

 జగపతిబాబు .. నాగేంద్రబాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారట. రెండు కుటుంబాల మధ్య సాగే ఫ్యాక్షన్ పోరుగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ నే కాదు .. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

  • Loading...

More Telugu News