KCR: కేసీఆర్ ఫ్రంట్ ను అమిత్ షా ఎలా స్వాగతిస్తారు?: సురవరం సుధాకర్ రెడ్డి

  • బీజేపీకి మేలు చేయడానికే కేసీఆర్ ఫ్రంట్
  • ఫ్రంట్ ను అమిత్ షా స్వాగతించడమే దీనికి నిదర్శనం
  • రాజకీయ అవగాహన ఉన్నవారెవరూ ఈ ఫ్రంట్ లో చేరరు

కేసీఆర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న థర్డ్ ఫ్రంట్ ను తాము స్వాగతిస్తున్నామని... ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకైనా కూటమిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పందించారు.

బీజేపీకి మేలు చేయడం కోసమే కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ ను అమిత్ షా స్వాగతించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వారెవరూ కేసీఆర్ ఫ్రంట్ లో చేరబోరని అన్నారు. వామపక్షాలు, తమతో పాటు కలసి వచ్చే పార్టీలతో కలసి ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

KCR
third front
amit shah
cpi
suravaram sudhakar reddy
  • Loading...

More Telugu News