v.hanumantha rao: కేసీఆర్ కలలు నెరవేరవు: వీహెచ్

  • థర్డ్ ఫ్రంట్ అసాధ్యం
  • కేసీఆర్ ను ఎవరూ నమ్మరు
  • మా బస్సు యాత్ర విజయవంతమైంది

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఏదో చేసేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారని... అయితే, ఆయన కలలు నెరవేరబోవని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలనే కేసీఆర్ నెరవేర్చలేదని, ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అంటూ ముందుకు వెళ్తున్న కేసీఆర్ ను ప్రజలెవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఉపయోగం లేదని, థర్డ్ ఫ్రంట్ అనేది అసాధ్యమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైందని... నేతలంతా కలసికట్టుగా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధ్యమని తెలిపారు. 

v.hanumantha rao
vh
kcr
third front
Congress
  • Loading...

More Telugu News