Summer: నేడు, రేపు మరింత వేడిగాలులు... ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు!

  • సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకూ అధిక వేడిమి
  • మూడు రోజుల వ్యవధిలో 30 మందికి పైగా మృతి
  • తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి

సగటు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధిక వేడిమి నమోదవుతుండగా, వచ్చే రెండు మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇంకా అధికమవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మండుతున్న ఎండలకు తోడు, తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.

కాగా, ప్రజలు ఇప్పటికే వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడచిన మూడు రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ తగిలి 30 మందికి పైగా మరణించారు. ఎండ వేడిమి నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులు, పనికి ఆహారం తదితర పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టిని సారించాయి ప్రభుత్వాలు. పనులు జరుగుతున్న చోట నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనులు నిలిపివేయాలని ఏపీ సర్కారు ఆదేశించింది.

  • Loading...

More Telugu News