Pawan Kalyan: కార్మికుల శ్రమను గౌరవించాలి: పవన్‌ కల్యాణ్‌

  • కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు
  • వారి అంకిత భావం విస్మరించలేనిది
  • కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలి

'ఒక జాతి నిర్మాణం, పురోగమనంలో కార్మికుల కఠోర శ్రమ, అంకిత భావం విస్మరించలేనివి. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇచ్చి గౌరవించడం మన ధర్మం' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. 'వారు తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కుల కోసం, కనీస వేతనాల కోసం ఉద్యమించే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. మే 1 కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి నా తరఫున, జనసేన తరఫున శుభాకాంక్షలు' అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అలాగే, 'మేడే శుభాకాంక్షలు' అంటూ గతంలో తన అభిమాన రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఓ కవితను పవన్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.              

Pawan Kalyan
may day
Jana Sena
  • Loading...

More Telugu News