Narendra Modi: మోదీ మోసాలలో దిట్ట.. అబద్ధాల పుట్ట.. ఆయనను అపజయాలు చుట్టుముట్ట!: ఎంపీ శివప్రసాద్

  • మోదీకి మనం చెప్పేది ఏమీ వినపడట్లేదు
  • ఆయన ఇండియాలో ఉంటేనే కదా!
  • పార్లమెంటు సమావేశాల్లోనూ ఉండరు

తాను ఇటీవల మోదీని విశ్వామిత్రుడి వేషంలో శపించానని టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. 'మోదీ మోసాలలో దిట్ట.. అబద్ధాల పుట్ట.. నిన్ను అపజయాలు చుట్టుముట్ట.. నీ నెత్తిమీద శని తిష్ట' అని అన్నానని తెలిపారు. మోదీకి మనం చెప్పేది ఏమీ వినపడట్లేదని, ఎందుకంటే ఆయన ఇండియాలో ఉంటేనే కదా అని, పార్లమెంటు సమావేశాల్లోనూ మొదటి రోజు ఐదు నిమిషాలు వస్తారని శివప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

ఈ రోజు తిరుపతిలో నిర్వహించిన ధర్మ పోరాట సభలో ఆయన మాట్లాడుతూ... 'చంద్రబాబు నాయుడిని తక్కువగా అంచనా వేస్తున్నారు. భూమికి ఎంత సహనం ఉందో అంత సహనం ఉంది ఆయనకి. ఆకాశమంత సహృదయం ఉంది. గాలి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే లక్షణం ఉంది. మనమంతా ఆయనకు అండదండగా ఉండి మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదాను తెచ్చుకోవాలి. మోదీ అందరికీ నీతులు చెప్పి తాను మాత్రం పాటించరు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటను మరిచారు' అని అన్నారు.

Narendra Modi
shiva prasad
Tirupati
  • Loading...

More Telugu News