charan: సల్మాన్ పంపించిన ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో.. చరణ్ కసరత్తులు!

  • బోయపాటితో చరణ్ మూవీ 
  • జిమ్ లో ప్రత్యేకమైన వర్కౌట్లు 
  • హాట్ టాపిక్ గా మారిన శాటిలైట్ రైట్స్  

సల్మాన్ ఖాన్ .. చరణ్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా ఒకరి సినిమా విశేషాలను మరొకరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వుంటారు. ఈ నేపథ్యంలోనే బోయపాటి సినిమా కోసం చరణ్ మరింత ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంది. అందుకోసం ప్రత్యేకమైన డైట్ తీసుకోవడమే కాకుండా .. జిమ్ లో వర్కౌట్స్ చేయాల్సి వుంది.

 ఈ విషయం గురించి తెలిసి, తన పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ రాకేశ్ ను ముంబై నుంచి సల్మాన్ పంపించాడట. ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలోనే చరణ్ కసరత్తులు చేస్తున్నాడు. ఈ విషయాన్ని చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. విడుదలకి ముందే ఈ సినిమా తెలుగు .. హిందీ శాటిలైట్ రైట్స్ 40 కోట్లకు అమ్ముడవడం హాట్ టాపిక్ గా మారింది.  

  • Loading...

More Telugu News