akash puri: మా నాన్న నాకు పారితోషికం ఇవ్వలేదు.. ఇస్తే తీసుకుంటా!: ఆకాశ్ పూరి

  • ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
  • కథానాయికగా నేహా శెట్టి 
  • మే 11వ తేదీన భారీ రిలీజ్

పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమా చేశాడు. నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను, మే 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఆకాశ్ పూరీ మాట్లాడుతూ .. "నిజం చెప్పాలంటే మా నాన్న నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడమే చాలా ఎక్కువ. అందువలన నేను పారితోషికం గురించి అడగలేదు. నేను అడగలేదు కదా అని ఆయన ఇవ్వలేదు. ఆయన పారితోషికం ఇస్తే మాత్రం తీసుకోవాలని వుంది" అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.

ఆ సమయంలో అక్కడే వున్న పూరీ .. 'ఈ సినిమా విడుదలైన తరువాత డబ్బులొస్తే, ఆకాశ్ ఆశించే దానికంటే ఎక్కువ ఇస్తాను' అన్నారు. ఇక ఇటు తండ్రీ .. అటు కొడుకూ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి.    

akash puri
neha shetty
  • Loading...

More Telugu News