Chiranjeevi: డల్లాస్ లో చిరంజీవి కన్నీరు పెట్టుకోలేదు: ఎన్నారైల వివరణ

  • డల్లాస్ పర్యటనలో ఉన్న చిరంజీవి
  • భావోద్వేగంతో కన్నీరు పెట్టారంటూ వీడియో వైరల్
  • అది 2013 నాటి వీడియో
  • వివరణ ఇచ్చిన ఎన్నారైలు

రెండు రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ వేడుకల నిమిత్తం డల్లాస్ కు వెళ్లిన చిరంజీవి అక్కడ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారని సోషల్ మీడియాల్లో, వివిధ న్యూస్ చానళ్లలో వైరల్ అవుతున్న వీడియో ఐదేళ్ల క్రితం వీడియో అని ప్రవాసాంధ్రులు వివరణ ఇచ్చారు. చిరంజీవి డల్లాస్ పర్యటన లేటెస్ట్ స్టిల్
2013లో ఆయన డల్లాస్ కు వచ్చినప్పుడు తీసిన వీడియోను ఇప్పుడు తిరిగి అప్ లోడ్ చేస్తూ, అది తాజా వీడియో అని చెబుతున్నారని, కొందరు కావాలనే ఆ వీడియోకు కులాలను రెచ్చగొట్టేలా కామెంట్లు పెట్టి పోస్టులు పెడుతున్నారని ఎన్నారైలు తుమ్మల కిరణ్, కంచర్ల సుధాకర్, చలసాని కిశోర్, కొణిదెల లోకేష్ తదితరులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నుంచి దృష్టిని మరల్చేందుకే ఇటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, వీటిని ఎవరూ నమ్మరాదని కోరారు. చిరంజీవి కన్నీరు పెట్టారంటూ వైరల్ అవుతున్న పాత వీడియో
కాగా, చిరంజీవి తాజా డల్లాస్ పర్యటనలో గడ్డంతో ఉండగా, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియోలో గడ్డం లేకపోవడాన్ని గమనించవచ్చు.

Chiranjeevi
Dallas
MAA
Silver Jubilee
  • Error fetching data: Network response was not ok

More Telugu News