Allu Arjun: రంగస్థలం, భరత్ అనే నేను... ఇక నా సినిమాతో హ్యాట్రిక్: అల్లు అర్జున్

  • విడుదలకు సిద్ధమైన అల్లు అర్జున్ కొత్త చిత్రం
  • వైభవంగా జరిగిన 'నా పేరు సూర్య' ఈవెంట్
  • టాలీవుడ్ కు హ్యాట్రిక్ విజయం ఖాయమన్న బన్నీ 

ఈ వేసవిలో రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం', మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రాల విజయవంతం తరువాత తాను నటించిన 'నా పేరు సూర్య' చిత్రంతో హ్యాట్రిక్ విజయాలు నమోదవ్వాలని కోరుకుంటున్నట్టు అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. గత రాత్రి తన కొత్త చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా ప్రసంగించిన ఆయన, త్వరలో విడుదలయ్యే 'మహానటి', 'మెహబూబా' చిత్రాలు కూడా హిట్ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

నిజాయితీతో కూడిన సినిమా ఒకటి చేయాలన్న తన చిరకాల కోరిక ఈ చిత్రంతో తీరిందని అన్నాడు. ఈ సినిమాను తాను వంశీని నమ్మి చేశానని, ఇది ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉంటుందని, ఇంతకన్నా ప్రస్తుతానికి ఇంకేమీ చెప్పలేనని అన్నాడు. 'రంగస్థలం'తో చరణ్ కేవలం హిట్ కొట్టడమే కాకుండా పరిశ్రమని మరో మెట్టు ఎక్కించాడని, మహేష్ నటించిన 'భరత్ అనే నేను' మంచి కలెక్షన్లతో దూసుకెళుతోందని అన్నాడు. ఇక తన సినిమా దాసరి నారాయణరావు పుట్టిన రోజున విడుదల కావడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పాడు.

Allu Arjun
Bharath Ane Nenu
Rangasthalam
Naa peru Surya
  • Loading...

More Telugu News