Ramcharan: అవినీతిలేని ఏకైక ఇండస్ట్రీ సినీ పరిశ్రమ మాత్రమే!: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

  • 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ప్రీ రిలీజ్ వేడుక
  • టాలీవుడ్ పై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించిన రామ్ చరణ్
  • నటీనటులకు ఎన్నో గాయాలు అవుతుంటాయి
  • ఒళ్లు హూనం చేసుకుని కష్టపడుతుంటామన్న చరణ్ 

ఈ ప్రపంచంలో ఏదైనా కరప్షన్ లేని పరిశ్రమ ఉందంటే, అది ఒక్క సినీ పరిశ్రమ మాత్రమేనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యాఖ్యానించాడు. గత రాత్రి జరిగిన 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో టాలీవుడ్ పై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు.

తన మామ అల్లు అరవింద్ ఏదైనా మాట్లాడితే వివాదం చెలరేగుతూ ఉంటుందని, ఆయన ఎందుకలా అంటారో, ఎంత బాధతో ఆయన మాట్లాడతారో తాను అర్థం చేసుకోగలనని అన్నాడు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి, జిమ్ చేసి, మేకప్ వేసుకుని సెట్స్ కు వెళితే సాయంత్రం 8 గంటల వరకూ పనిచేస్తామని, ఎండా, వాన లెక్కచేయమని అన్నాడు.

బన్నీకి రిస్కీ షాట్ల కారణంగా ఎన్ని గాయాలు అయ్యాయో తనకు తెలుసునని, మహేష్ బాబు, తారక్, ప్రభాస్ లకూ గాయాలు అయ్యాయని అన్నాడు. ఇటీవల తన తండ్రికి, బాలకృష్ణకు షోల్డర్ ఇంజురీ అయిందని గుర్తు చేశాడు. ఇలా ఒళ్లు హూనం చేసుకుంటూనే తామంతా కష్టపడుతున్నామని అన్నాడు. మీడియాకు సైతం అంతా తెలుసునని, అయినా, ఏదో రాస్తూ ఉంటారని చురకలు అంటించాడు.

Ramcharan
Allu Arjun
Naa Peru Surya
Tollywood
Injuries
  • Loading...

More Telugu News