Sonia Gandhi: అవినీతిని అంతమొందిస్తామన్న మోదీజీ నినాదం ఇప్పుడు ఏమైంది?: సోనియా గాంధీ

  • ఎన్నికల ముందు అవినీతిని అంతమొందిస్తామన్నారు
  • అవినీతికి పాల్పడే మార్గాలు మరింత పెరిగాయి
  • విద్యార్థులు ప్రశ్నించడానికి కూడా స్వాతంత్ర్యం లేదు
  • ప్రసార మాధ్యమాలను కూడా అడ్డుకుంటున్నారు

ఎన్నికల ముందు నరేంద్ర మోదీ అవినీతిని అంతమొందిస్తామంటూ నినాదాలు ఇచ్చారని, అదిప్పుడు ఏమైందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ జనాక్రోశ్‌ ర్యాలీ నిర్వహించి, భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి మోదీ తీరుపై విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ... ఎన్డీఏ హయాంలో దేశంలో అవినీతికి పాల్పడే మార్గాలు మరింత పెరిగాయని విమర్శించారు.
 
తాము లంచాలు తీసుకోము, ఇంకొకరిని తీసుకోనివ్వమని ఎన్నికల ముందు మోదీ చెప్పారని, కానీ ఇప్పుడు దేశంలో అవినీతి మరింత పెరిగిపోయిందని సోనియా గాంధీ అన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు దేశాన్ని, దేశ ప్రజలను బలహీనపర్చేలా ఉన్నాయని అన్నారు. వీటిని మనమంతా తీవ్రంగా పరిగణించాలని, వీటికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని అన్నారు. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, ఇప్పుడు విద్యార్థులు ప్రశ్నించడానికి కూడా స్వాతంత్ర్యం లేదని సోనియా గాంధీ విమర్శించారు. ప్రసార మాధ్యమాలను కూడా తమ విధి తాము నిర్వర్తించకుండా ఏదో ఒక మార్గంలో అడ్డుకుంటున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News