New Delhi: నాలుగేళ్లుగా అంతులేని దారుణాలు: లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల 'జన్ ఆక్రోశ్'లో రాహుల్ గాంధీ

  • న్యూఢిల్లీలో జన్ ఆక్రోశ్ ర్యాలీ
  • అవినీతిపరులంతా మోదీ పక్కనే
  • అత్యాచారాలు, హత్యల్లో అభివృద్ధి
  • మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

గడచిన నాలుగు సంవత్సరాలుగా అంతులేని దారుణాలు దేశంలో జరిగాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో పార్టీ చేపట్టిన 'జన్ ఆక్రోశ్ ర్యాలీ'కి హాజరైన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాహుల్ పార్టీకి అధ్యక్షుడైన తరువాత భారీ స్థాయిలో చేపట్టిన ఈ ర్యాలీకి సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రులు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

రాహుల్ ప్రసంగిస్తూ, నిత్యమూ అబద్ధాలు చెప్పే నరేంద్ర మోదీ, తన పక్కనే అవినీతిపరులను ఉంచుకున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటే దాన్ని నీరవ్ మోదీ దోచుకెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రూ. 700 కోట్లతో హెచ్ఏఎల్ విమానాలు కొనుగోలు చేశామని గుర్తు చేసిన ఆయన, మోదీ సర్కారు రూ. 1,500 కోట్లు పెట్టి అవే విమానాలు కొంటోందని, పైగా ఈ విషయం తనకు తెలియదని రక్షణ మంత్రి చెప్పడం మోదీ నిరంకుశత్వాన్ని చెప్పకనే చెబుతోందని వ్యాఖ్యానించారు.

నోట్ల రద్దుతో పాటు గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ)తో ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన ఆయన, గత నాలుగేళ్లుగా దేశంలో అత్యాచారాలు, హత్యలు, దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయని, బీజేపీ హయాంలో అభివృద్ధి ఇదేనని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News