Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పూజా హెగ్డే 'ఫెయిల్యూర్' బాధ! 
  • ఫ్రాన్స్ వెళుతున్న మెగా హీరో 
  • నాగార్జున, నాని కోసం భారీ కాలనీ సెట్
  • మరో షెడ్యూలుకు రెడీ అవుతున్న ఎన్టీఆర్

*  ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తాను బాగా ఏడ్చేస్తానని చెబుతోంది కథానాయిక పూజా హెగ్డే. 'అవును, అపజయాన్ని నేను తట్టుకోలేను. ఓ పావుగంట బాగా ఏడ్చేస్తాను. దాంతో బాధంతా పోతుంది. ఆ తర్వాత ఇక దాని గురించి మరచిపోతాను' అని చెప్పింది పూజ.  
*  సాయిధరం తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ' తేజ్ ఐ లవ్ యూ' చిత్రానికి సంబంధించిన రెండు పాటలను త్వరలో ఫ్రాన్స్ లో చిత్రీకరిస్తారు. మే నెలాఖరుకి చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసి, జూన్ లో దీనిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తోంది.
*  నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం కోసం హైదరాబాదులో ఓ భారీ కాలనీ సెట్ ను వేస్తున్నారు. దీనికి కోటి రూపాయలు ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది. శ్రీరాం ఆదిత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.    
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ మే మొదటి వారంలో మొదలవుతుంది. తొలి షెడ్యూలులో యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.    

  • Loading...

More Telugu News