Mohammad Shami: బీసీసీఐని షమీ ఎలా మోసం చేశాడంటే..: హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు

  • తప్పుడు జన్మ ధ్రువీకరణ చూపించాడు
  • 1982లో పుట్టి 1990 అని చెప్పాడు
  • ఎంతో మంది నష్టపోయారన్న హసీన్ జహాన్

తాను పుట్టింది 1982లో అయితే, 1990లో పుట్టినట్టుగా క్రికెటర్ మహ్మద్ షమీ ఏకంగా బీసీసీఐనే మోసం చేస్తున్నాడని ఆయన భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చి బీసీసీఐతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ను కూడా మోసం చేశాడని ఆరోపించింది. షమీ డ్రైవింగ్ లైసెన్స్ ను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా బయటపెట్టిన ఆమె, ఆపై కాసేపటికే సదరు పోస్టును డిలీట్ చేయగా, ప్రస్తుతం దాని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ లో షమీ 1982లో పుట్టినట్టు ఉండగా, బీసీసీఐ వద్ద ఆయన 1990లో పుట్టినట్టుగా ఉంది. ఆయన అండర్ -22 టోర్నీలో తప్పుడు వయసు చూపించి ఆడుతూ ఎంతోమంది క్రికెటర్లు నష్టపోయేలా చేశాడని కూడా హసీన్ జహాన్ ఆరోపించింది.

Mohammad Shami
Haseen Jahan
Cricket
BCCI
Date Of Birth
  • Loading...

More Telugu News