palle: టీడీపీ బైక్ యాత్రలో ప్రమాదం.. పల్లె రఘునాథ రెడ్డి ఎడమ చేతికి, కాలికి స్వల్ప గాయాలు

  • దొన్నికోట వద్ద బైక్‌ర్యాలీ
  • ఢీకొన్న మరో బైక్‌
  • చికిత్స చేయించుకుని తిరిగి యాత్ర కొనసాగింపు

ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుకి నిరసనగా అనంతపురం జిల్లాలోని నల్లమడ మండలం దొన్నికోట వద్ద నిర్వహించిన టీడీపీ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బైక్ యాత్రలో పాల్గొంటోన్న సమయంలో ఏపీ ప్రభుత్వ చీఫ్ వీప్ పల్లె రఘునాథరెడ్డి  ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టడంతో ఆయన ఎడమచేతికి, కాలికి గాయాలయ్యాయి. అనంతరం ఆయన చికిత్స చేయించుకుని తిరిగి యాత్రను కొనసాగించినట్లు తెలిసింది. కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ  స్పీకర్  కోడెల శివప్రసాదరావు పాల్గొన్న సైకిల్‌ ర్యాలీలోనూ అపశ్రుతి చోటు చేసుకుని కోడెల తలకు స్పల్ప గాయమైన విషయం తెలిసిందే.

palle
bike
Telugudesam
  • Loading...

More Telugu News