Kurnool District: కర్నూలు జిల్లాలో వైసీపీ నేతను ట్రాలీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో దాడి!

  • తుగ్గలి మండలం శభాష్ పురం సర్పంచ్ హనుమంతుపై హత్యాయత్నం
  • పెళ్లికి వెళ్లి వస్తుండగా అటాక్
  • పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన వైసీపీ నేతపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. శభాష్ పురం సర్పంచ్ హనుమంతుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన బైక్ పై వస్తుండగా, కొందరు వ్యక్తులు ట్రాలీతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. ఓ పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా హనుమంతుపై ఈ హత్యాయత్నం జరిగింది.

Kurnool District
tuggali mandal
surpanch
hanumanthu
attack
YSRCP
  • Loading...

More Telugu News